Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > ఎకరాకు రూ.12 వేలు..రైతుభరోసా మార్గదర్శకాలు

ఎకరాకు రూ.12 వేలు..రైతుభరోసా మార్గదర్శకాలు

Telangana Raithu Barosa | రైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపైన తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా జీవోను కూడా తెలుగులో వెలువరించింది.

రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12,000 ప్రభుత్వం ఇవ్వనుంది. భూభారతి పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించనున్నారు.

ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగిస్తారు. ROFR పట్టాదారులు కూడా రైతుభరోసాకి అర్హులు. అలాగే ఫిర్యాదుల పరిష్కారం బాధ్యతల్ని కలెక్టర్లకు అప్పగించారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions