Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

telangana common entrance tests

TG Govt Says Good News | నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 17.651 శాతం కరువు భత్యం (DA) పెంపు ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. జూలై 1, 2025 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. దీనివల్ల తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యుత్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ధరల సూచీని బట్టి చేసే సమీక్షలో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

You may also like
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
cm revanth reddy
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో!
“నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?”
నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions