Tuesday 16th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘రూ. లక్ష చెప్పులు వేసుకునే వాడు పేదవాడుఎలా అవుతాడు’

‘రూ. లక్ష చెప్పులు వేసుకునే వాడు పేదవాడుఎలా అవుతాడు’

nara lokesh
  • సీఎం జగన్ పై లోకేష్ ఫైర్..!

Lokesh Slams CM Jagan | ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan)పై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh).

బుధవారం కోనసీమ జిల్లాలో జరిగిన యువ గళం పాదయాత్రలో పాల్గొని, ప్రసాగించారాయన.

ఈ సందర్భంగా  జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి (TDP Janasena Alliance) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

కానీ టీడీపీ జనసేన కలవకుండా కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.

జగన్ సీఎం అయ్యాక విషపూరితమైన మద్యాన్ని అమ్ముతూ, ప్రజల నుండి డబ్బుని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రమాదకరమైన నకిలీ మద్యాన్ని అమ్ముతున్న పాపం జగన్ కు ఊరికే పోదని పేర్కొన్నారు.

మరోవైపు  ఏపీలో వర్గపోరు జరుగుతుందని, పేదలు, డబ్బున్న వారి మధ్య పోటీ జరుగుతున్నట్లు జగన్ చెబుతున్నారు,

కానీ రూ. లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వారు పేదలు ఎలా అవుతారు అంటూ ఎద్దేవా చేశారు లోకేశ్. వేల కోట్ల ఆస్తులు, ప్యాలెస్ లు ఉన్న జగన్ పేదవాడు ఎలా అవుతాడని మండిపడ్డారు లోకేశ్.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
nara lokesh
“మీ బాధ్యత నాది.. జీవితాంతం అండగా ఉంటా: నారా లోకేశ్
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions