Thursday 17th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అదానీకి అరెస్ట్ వారెంట్.. ఛార్జిషీట్ లో మోదీ పేరు చేర్చాలి

అదానీకి అరెస్ట్ వారెంట్.. ఛార్జిషీట్ లో మోదీ పేరు చేర్చాలి

Subramanian Swamy On Adani Bribery Case | సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టు ( Solar Project Contract )ల కోసం లంచం ఇచ్చి లబ్ది పొందారనే అభియోగాలతో గౌతమ్ అదానీ ( Gautam Adani )పై అమెరికాలో కేసు నమోదయ్యింది.

అలాగే అదానీపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడం సంచలనం రేపుతోంది. అంతేకాకుండా ఈ స్కాంలో పలు రాష్ట్రాల అధికారులు, అగ్ర నేతలు ఉన్నారనే కథనాలు కలకలం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రధాని మోదీ అదానీని రక్షించే పనిలో ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ( Subramanian Swamy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ అమెరికా కేసులో విచారణ ప్రారంభం అయ్యాక ప్రధాని మోదీ ( Pm Modi ) పేరును కూడా ఛార్జిషీట్ లో చేర్చాల్సి ఉంటుందని ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions