Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > వారు ఉగ్రవాదులతో సమానం…సజ్జనర్ హెచ్చరిక

వారు ఉగ్రవాదులతో సమానం…సజ్జనర్ హెచ్చరిక

sajjanar

Sajjanar likens drunk drivers to terrorists | హైదరాబాద్ సీపీ గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు వీసీ సజ్జనర్. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారు రోడ్డు టెర్రరిస్టులు అని స్పష్టం చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లపై ఉక్కుపాదం మోపడం ఖాయం అన్నారు. కారణం తగిన మైకంలో వారు ఇతరుల్ని చంపే ప్రమాదం ఉందని, లేదా వారే మరణించే అవకాశం ఉందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారు సూసైడ్ బాంబర్లతో సమానం అన్నారు. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు.

దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ సమస్య వేధిస్తుందని, డ్రగ్స్ సరఫరదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సజ్జనర్ పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాపుల మూలంగా యువత తీవ్రంగా నష్టపోతుందని, వీఐపీలు ఇలాంటి యాపులను ప్రమోట్ చేయొద్దని సూచించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions