Thursday 15th October 2026
12:07:03 PM
Home > క్రీడలు > రింకూసింగ్ తండ్రి కన్నుమూత

రింకూసింగ్ తండ్రి కన్నుమూత

Rinku Singh’s Father Passes Away Due To Cancer | టీం ఇండియా స్టార్ ప్లేయర్ రింకూసింగ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖాన్ చంద్ సింగ్ కన్నుమూశారు. స్టేజ్-4 క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్ తో రింకూ తండ్రి బాధపడుతున్నారు. తాజగా పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే మ్యాచ్ కంటే ముందు రింకూసింగ్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ కు హాజరైన తుడిజట్టులో చోటు దక్కలేదు.

మరోవైపు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఖాన్ చంద్ సింగ్ శుక్రవారం ఉదయం మరణించారు. రింకూ క్రికెటర్ గా ఎడగడంలో ఆయన తండ్రి కీలక పాత్ర పోషించారు. ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. యూపీలోని అలీఘడ్ లో ఎల్పీజీ గ్యాస్ డెలివరీ విభాగంలో ఆయన పనిచేశారు. ఈ క్రమంలో టీం ఇండియా ప్లేయర్లు, మాజీ క్రికెటర్లు రింకూ తండ్రి మృతికి నివాళులర్పిస్తున్నారు.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions