Tuesday 14th April 2026
12:07:03 PM
Home > తాజా > డేవిడ్ మిల్లర్ తో వీడియో..ఆమెకు రేప్ బెదిరింపులు!

డేవిడ్ మిల్లర్ తో వీడియో..ఆమెకు రేప్ బెదిరింపులు!

Princy Parikh deletes viral David Miller reel after ‘disturbing rape threats’ | సౌత్ ఆఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తో ఫన్నీ రీల్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు అత్యాచార బెదిరింపులు, బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. టీ-20 వరల్డ్ కప్ సూపర్-8 లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గత ఆదివారం భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో 76 పరుగుల తేడాతో టీం ఇండియాను సౌత్ ఆఫ్రికా ఓడించింది. ఈ మ్యాచ్ లో 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత ఓటమికి ప్రధాన కారణం అయిన డేవిడ్ మిల్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. ఈ తరుణంలో గుజరాత్ కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రిన్సీ పారిక్ డేవిడ్ మిల్లర్ తో కలిసి ఓ ఫన్నీ రీల్ ను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే భారత ఓటమికి కారణం అయిన ఆటగాడితో రీల్ ఎలా చేస్తావంటూ కొందరు నెటిజన్లు రెచ్చిపోయారు. ఆమెకు అత్యాచార బెదిరింపులు రావడమే కాకుండా బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్లతో రెచ్చిపోయారు. ఎదురైన చేదు అనుభవంతో సదరు ఇన్ఫ్లుయెన్సర్ వెంటనే వీడియోను డిలీట్ చేశారు. అలాగే అత్యాచార బెదిరింపులు, బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్లు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. కాగా ఫన్నీ వీడియోపై ఇలా అసభ్యకరంగా స్పందించిన వారిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions