Thursday 17th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘పీటీ వారెంట్ మీద విజయవాడకు పోసాని..రిమాండ్ విధించిన కోర్టు’

‘పీటీ వారెంట్ మీద విజయవాడకు పోసాని..రిమాండ్ విధించిన కోర్టు’

Posani Krishna Murali News | సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకి మార్చి 20 వరకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు మరియు వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేశారని జనసేన నేత శంకర్ విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు, పీటీ వారెంట్ జారీ చేశారు. అనంతరం కర్నూల్ జైలులో ఉన్న పోసానిని విజయవాడలోని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు 20 రోజుల రిమాండ్ విధించింది. దింతో పోసానిని విజయవాడ జైలుకు తరలించనున్నారు.

ఇదిలా ఉండగా తనపై అక్రమ కేసులు పెట్టారంటూ కోర్టులో పోసాని వాపోయారు. ఒకే రకమైన కేసులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని న్యాయాధికారికి తెలియజేశారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని.. గుండె జబ్బు, పక్షవాతం లాంటి సమస్యలు ఉన్నాయని పోసాని కోర్టుకు తెలియజేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions