Mega Family Special Interview | తమ కుటుంబంలో పవన్ కళ్యాణ్ స్పెషల్ కిడ్ ( Special Kid ) అని చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఫ్యామిలీ నుండి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ విడుదల అయ్యింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు తల్లి అంజనమ్మ, చెల్లెల్లు మాధవి, విజయ దుర్గ మరియు తమ్ముడు నాగబాబు పాల్గొన్నారు. ఇందులో తమ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను సవాళ్ళను పంచుకున్నారు.
తల్లికి అందరికంటే ఎక్కువ నాగబాబు క్లోజ్ ( Close ) అని, తమ్ముడు కనిపించిన వెంటనే తల్లి నవ్వుతుందని చిరంజీవి చెప్పారు. అంజనమ్మ పెద్దగా చదువుకోలేదని, బయట కూడా ఎక్కువ తిరగలేదని కానీ ఇప్పటికీ కుటుంబం కలిసి ఉందంటే కారణం తమ తల్లే అంటూ నాగబాబు చెప్పారు.
ఇదే సమయంలో అమ్మ చేతి వంట గురించి ప్రస్తావన వచ్చింది. ‘అన్నయ్య చిరంజీవి ఇంట్లో ఏది పెట్టినా తినేసేవాడు, కానీ నేను కూరలు సరిగ్గా లేకపోతే తినేవాడ్ని కాదు. మరీ ముఖ్యంగా వెజ్ ( Veg ) అంటే కొంచెం కోపం వచ్చేది’ అంటూ నాగబాబు నవ్వులు పూయించారు.
మరోవైపు ‘పవన్ మాత్రం మంచి కూరలు ఉంటే తినేవాడు, కానీ నచ్చని వంటకం ఉంటే మాత్రం నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్లిపోయేవాడు’ అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను నాగబాబు గుర్తుచేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంట్లో వంటపై నిశ్శబ్ద నిరసన తెలియజేసేవాడని చెప్పారు. చిన్నప్పుడు పవన్ అంత బలంగా ఉండేవాడు కాదు, అందుకే ఆహారం విషయంలో తల్లి ప్రత్యేక శ్రద్ధ వహించేది అని పేర్కొన్నారు.