Sunday 13th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రూ. 500 నోట్లపై సోషల్ మీడియాలోప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పీఐబీ!

రూ. 500 నోట్లపై సోషల్ మీడియాలోప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పీఐబీ!

pib fact check

PIB Factcheck On Rs. 500 Note | కొద్ది రోజుల నుంచి 500 రూపాయల నోటుపై ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

‘ఈ ఏడాది మార్చి నుంచి ఏటీఎంలలో 500 రూపాయల నోట్ల కనిపించవు. ఎందుకంటే ఆర్బీఐ ఈ నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంది’ అంటూ ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ వైరల్ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. 500 రూపాయల నోట్లపై జరుగుతున్న ప్రచారం ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. రూ. 500 కరెన్సీ నోట్లపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది.

ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దనీ, ప్రజలు ఈ నోట్లపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ. 500 నోట్లను యథావిధిగా వినియోగించుకోవచ్చని తెలిపింది.

You may also like
దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions