Friday 5th June 2026
12:07:03 PM
Home > తాజా > ‘భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్న భర్త’

‘భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్న భర్త’

Husband bites off wife’s nose in shocking attack | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన ముక్కు అందంగా ఉందని భర్త కోరుక్కుతిన్నట్లు ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా, శాంతీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మధు ఖాతూన్ అనే మహిళ తన భర్త బాపన్ షేక్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తాను నిద్రపోతున్న సమయంలో భర్త బాపన్ షేక్ ముక్కును కొరికేశాడని భార్య మధు ఖాతున్ పేర్కొంది. బాపన్ షేక్ గతంలో “నీ ముక్కు అందంగా ఉంది, అవకాశం దొరికితే కొరికి తినేస్తాను” అని అనేవాడని, చివరకు అతడు అలాంటి దారుణమైన చర్యకు పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఘటన తర్వాత మధు తన తల్లితో కలిసి శాంతీపుర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions