Balayya Comments On Trump Victor | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ (Republican Party) అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి ట్రంప్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా, టాలీవుడ్ నటుడు, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ట్రంప్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. “అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండో సారి ఘనవిజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ విజయం అమెరికా-భారత్ సంబంధాలలో కొత్త శకానికి నాందిగా నిలుస్తుంది. అన్ స్టాపబుల్ గా విజయం సాధించిన విధంగా భారత్-అమెరికా ల మధ్య కూడా అన్ స్టాపబుల్ గా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని, అభివృద్ధిలో పరస్పర సహకారం అందించాలని కోరుతున్నాను. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, భద్రతకు సహకరించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు బాలయ్య.