Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > కటింగ్ చేసి డాన్స్ వేసి..మల్లారెడ్డి స్టైల్ ప్రచారం

కటింగ్ చేసి డాన్స్ వేసి..మల్లారెడ్డి స్టైల్ ప్రచారం

Malla Reddy News | మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన స్టైల్ లో ప్రచారం చేస్తూ వార్తల్లో నిలిచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బీఆరెస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మల్లారెడ్డి సైతం రంగంలోకి దిగారు. ఇంటింటి ప్రచారం చేస్తూ సందడి చేశారు.

‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను పంపిణీ చేసిన మల్లారెడ్డి ప్రచారం మధ్యలో చిన్నారులను ఎత్తుకుని సరదాగా కాసేపు డాన్స్ చేశారు. అనంతరం ఓ కటింగ్ షాపుకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తికి కటింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆరెస్ తరఫున దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ పడుతున్నారు. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions