Tuesday 11th August 2026
12:07:03 PM
Home > తాజా > కుటుంబంతో కలిసి కోర్టుకు నాగార్జున..వాంగ్మూలంలో ఏం చెప్పారంటే !

కుటుంబంతో కలిసి కోర్టుకు నాగార్జున..వాంగ్మూలంలో ఏం చెప్పారంటే !

Nagarjuna Appears In Nampally Court | మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) ఆరోపణల నేపథ్యంలో నటుడు అక్కినేని నాగార్జున ( Nagarjuna ) నాంపల్లి కోర్టు ( Nampally Court )లో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.

పిటిషన్ నేపథ్యంలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు సతీమణి అమల ( Amala ), కుమారుడు నాగ చైతన్య ( Naga Chaitanya )తో కలిసి కోర్టు ఎదుట నాగార్జున హాజరయ్యారు.

తన కుటుంబంతో పాటు చైతన్య సమంత ( Samantha ) విడాకులపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున తెలిపారు. కొండా సురేఖ వ్యాఖ్యల మూలంగా తన కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని వాంగ్మూలం ఇచ్చారు.

రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును నాగార్జున కోరారు. నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే అంటూ మంత్రి కొండా సురేఖ అసభ్యకరంగా మాట్లాడారని పేర్కొన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions