MLC Teenmar Mallanna | సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna). కొద్ది రోజుల కిందట కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johny Master) జైలుకు వెళ్లటంలో అల్లు అర్జున్ కుట్ర ఉందని వ్యాఖ్యానించారు.
ఆ ఉసురు తగిలే అల్లు అర్జున్ ఇప్పుడు జైలుకు వెళ్లాడన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును ప్రకటించటం పట్ల అల్లు అర్జున్ జీర్ణించుకోలేకపోయాడన్నారు.
నేషనల్ అవార్డు తనకొక్కడికే ఉండాలని కుట్రపూరితంగా ఓ అమ్మాయితో కేసులు పెట్టించి జైలుకు పంపినట్లు మల్లన్న ఆరోపించారు. జానీ మాస్టర్‌కు బెయిల్ కూడా రాకుండా సుప్రీం కోర్టు దాకా వెళ్లి కేసులు పెట్టినట్లు చెప్పారు.
జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చినా కూడా నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ కూడా రాసినట్లు ఆరోపించారు. మరి ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డుని వెనక్కి ఇస్తాడా? అని మల్లన్న ప్రశ్నించారు.