HariHara VeeraMallu | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ లభించింది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు: పార్ట్-2 స్వార్డ్ వర్సస్ స్పిరిట్ ‘ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
ఈ విషయాన్ని సినిమా ప్రొడ్యూసర్ ఏ. ఎం. రత్నం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆఖరి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నారని దింతో సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు వీరమల్లు కాస్ట్యూమ్ లో ఉన్న పవన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ‘షూటింగ్ పూర్తయ్యింది.
అదిరిపోయే పాటలు, ట్రైలర్ అతి త్వరలో విడుదల అవుతాయి. సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టించడం ఖాయం’ అని నిర్మాత పేర్కొన్నారు. మరోవైపు వీఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 9న సినిమా విడుదల అవుతుందని గతంలో మేకర్స్ ప్రకటించారు.
అయితే షూటింగ్ ఆలస్యం కావడం మూలంగా మరో తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత రత్నం తనయుడు జ్యోతిక్రిష్ణ డైరెక్షన్ బాధ్యతల్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే.