Pawan Kalyan resumes the ‘OG’ shooting | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ డీవివి ఎంటర్టైన్మెంట్.
మాఫియా బ్యాగ్డ్రాప్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజి’. చాలా రోజుల క్రితమే మూవీ షూటింగ్ మొదలైనా ఎన్నికలు, అనంతరం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది.
అయితే వీలు దొరికినప్పుడల్లా పవన్ తన సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయిన విషయం తెల్సిందే. ఇకపోతే పవర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజి మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొన్నారు.
ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘మళ్లీ మొదలయ్యింది, ఈసారి ముగిద్దాం’ అని పోస్ట్ చేసింది. అలాగే ‘పవన్ కళ్యాణ్ బ్యాక్ ఆన్ ఓజి సెట్’ అంటూ వెల్లడించింది. మరికొన్ని రోజుల్లో ఓజి మూవీ షూటింగ్ పూర్తికానున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. ఇకపోతే థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఓజి టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.