Monday 17th March 2025
12:07:03 PM
Home > తాజా > జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్!

జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్!

allu arjun pressmeet

Allu Arjun Pressmeet | సంధ్య థియేటర్ (Sandhya Theatre) ఘటనలో అరెస్టయిన నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) శనివారం ఉదయం 6 గం. 40 నిలకు విడుదల అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు.  అనంతరం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమాభిమానాలతో నా హృదయం నిండిందన్నారు. సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని చెప్పారు. ఆ కుటుంబానికి జరిగిన దానికి తాను ఎంతగానో బాధపడుతున్నానని తెలిపారు.

రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ఆ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదనీ, ప్రమాదవశాత్తూ జరిగిందని తెలిపారు. అనుకోకుండా జరిగిన ఆ ఘటనలో తన ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఇది చోటుచేసుకుందని చెప్పారు.

త్వరలోనే రేవతి కుటుంబాన్ని కలుస్తానని తెలిపారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందనీ. దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదని అల్లు అర్జున్ చెప్పారు.

You may also like
‘యూట్యూబర్ హర్షసాయి నీకు బుద్ధి ఉందా’
‘ఏయ్ పోలీస్! పాటకు డాన్స్ చెయ్ లేదంటే సస్పెండ్’
‘హిందీ వివాదం..పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన’
హిందీ గో బ్యాక్..పవన్ గత వ్యాఖ్యల్ని గుర్తుచేసిన స్టాలిన్ సోదరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions