Monday 22nd June 2026
12:07:03 PM
Home > తాజా > ఇందిరమ్మ ఇండ్లపై శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి!

ఇందిరమ్మ ఇండ్లపై శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి!

ponguleti srinivas reddy

Indiramma Houses | ఇండ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) నిర్మిస్తామని కాంగ్రెస్  ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు.

నవంబర్ 6 నుంచి ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల ఎంపిక‌ ఉంటుందని తెలిపారు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఇందిర‌మ్మ ఇండ్లను పూర్తి చేస్తామని చెప్పారు. 15 రోజుల్లొ గ్రామ క‌మిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంట‌నే జాబితాలను ఖ‌రారు చేస్తామన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్రక్రియగా ఉంటుందని పేర్కొన్నారు. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు పొంగులేటి. మొదటి విడతలో రేషన్ కార్డులు లేనివారికి కూడా ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

రెండో విడత నుంచి మాత్రం రేషన్ కార్డు ఉంటేనే అర్హులని చెప్పారు. ఇక గ్రామాల్లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే ఫైన‌ల్‌ అని మంత్రి వెల్లడించారు. ఇండ్లు మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేస్తారని.. ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నామన్నారు.

పునాదికి రూ.లక్ష, గోడ‌ల‌కు రూ లక్షా ఇరవైఐదు వేలు, శ్లాబ్‌కు లక్షా యాభైవేలు, ఇళ్లు పూర్తయిన తర్వాత మరో ల‌క్ష చొప్పున అందజేస్తామని తెలిపారు.

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions