Thursday 8th October 2026
12:07:03 PM
Home > తాజా > మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!

మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!

minister komatireddy

Komatireddy Venkat Reddy | తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల సమీపంలోని గుండ్రాంపల్లి వద్ద ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది.

అదే సమయంలో నల్లగొండ నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రమాదాన్ని గుర్తించి వెంటనే తన కాన్వాయ్‌ను తక్షణమే ఆపించారు.  క్షతగాత్రులను అంబులెన్స్‌ లో సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.

అలాగే వైద్యులతో స్వయంగా మాట్లాడి బాధితులకు తక్షణ వైద్యసహాయం అందేలా ఆదేశాలు జారీ చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions