Monday 10th August 2026
12:07:03 PM
Home > తాజా > కవితను బీఆరెస్ నుంచి సస్పెండ్ చేసిన కేసీఆర్

కవితను బీఆరెస్ నుంచి సస్పెండ్ చేసిన కేసీఆర్

Kavitha Suspended From BRS By Father KCR | ఎమ్మెల్సీ కవితను భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు ప్రకటనలో బీఆరెస్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు తెలిపారు.

ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. కాగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన కవిత మాజీ మంత్రి హరీష్ రావు, పార్లమెంటు మాజీ సభ్యుడు సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని వీరి మూలంగానే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని సంచలన ఆరోపణలు చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions