India Tour Of Australia | మరికొద్ది రోజుల్లో టీం ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఐదు టీ-20 మ్యాచుల సిరీస్, మూడు వన్డే మ్యాచుల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించింది.
బ్యాక్ పెయిన్ నుంచి కెప్టెన్ కమిన్స్ ఇంకా కోలుకోలేదని. దింతో టీ-20 జట్టు సారథి మిచెల్ మార్ష్ ను వన్డే సిరీస్ కోసం తాత్కాలిక కెప్టెన్ గా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ స్టార్క్ ఇండియాతో జరగబోయే సిరీస్ కోసం ఎంపికయ్యారు. విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీ-20 సిరీస్ మరియు వన్డే సిరీస్ కు ఎంపికయ్యారు.
ఇకపోతే అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించిన బీసీసీఐ శుభమన్ గిల్ ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. అయితే రోహిత్ మరియు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్లేయర్లుగా వన్డే సిరీస్ లో ఆడనున్నారు.









