Saturday 1st August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రేపు తీవ్ర తుపానుగా బలపడి తీరం దాటే అవకాశం

రేపు తీవ్ర తుపానుగా బలపడి తీరం దాటే అవకాశం

Impact of Cyclone Michoung on the state

-రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను ప్రభావం
-ప్రస్తుతం కాకినాడ జిల్లా పొన్నాడ శీలంవారిపాకల వద్ద పాదయాత్ర
-7న మళ్లీ ఆగిన చోటునుంచే ప్రారంభం

హైదరాబాద్ (కపోతాం):నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ తుపాను రేపు తీవ్ర తుపానుగా బలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

యువగళం పాదయాత్రకు మూడు రోజులపాటు విరామం ప్రకటించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు పాదయాత్ర చేరుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఈ నెల 7న మళ్లీ పాదయాత్ర ఆగిన చోటు నుంచే అంటే శీలంవారిపాకల నుంచే ప్రారంభం కానుంది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions