Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలుకుదాం!

కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలుకుదాం!

Happy New Year 2025

Happy News Year 2025 | పాత సంవత్సరం.. కొత్త సంవత్సరం..! గోడకు వేసిన క్యాలెండర్ మారుతుంది. మొబైల్ లో ఓ తేదీ మారుతుంది. 12 నెలల తర్వాత సంవత్సరం నంబరులో చివరి అంకె మారి, తెలిసిన పాత తేదీయే మళ్లీ కొత్తగా పలకరిస్తుంది.

ప్రతిసారి ఈ ఏడాది జరిగిన మంచి చెడును విశ్లేషించుకొని, రానున్న కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలతో ముందుకెళ్లడం పరిపాటి. ఇంకా చెప్పాలంటే అనాదిగా అనుసరిస్తున్న ‘సంప్రదాయం’.

‘ప్రతి ఏడాది కొత్తగా ఏం ఉండదు.. జీవితంలో ఏం మారదు’ అనే సో కాల్డ్ మేధావుల సంగతి కాస్త పక్కనపెట్టండి. కొత్తగా వచ్చే ఏడాదిని సరికొత్తగా ప్రారంభించాలనే ఓ ఆశావహ దక్పథంతో ముందుకెళ్లడంలో తప్పేముంది

అనుభవాలే పాఠాలు.. పాఠాలే జ్ఞాపకాలు.. జ్ఞాపకాలే జీవితాలు..

“జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే.. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు” అన్నాడో పెద్దమనిషి.
ఈరోజు సమస్య ఉందనుకుంటే రేపు మరో పెద్ద సమస్య వస్తుంది.. కానీ దాన్ని అధిగమించే పరిపక్వత నీకొస్తుంది.

సో.. సమస్యలు ఏవైనా, సవాళ్లు ఎన్ని ఎదురైనా ఆశ, ఆశయంతో అందమైన భవిష్యత్తు కోసం వేసే అడుగుల్లో కాస్త వేగం పెంచుదాం.

తెలిసీ తెలియక చేసిన తప్పులను తలపుల నుంచి తరిమేద్దాం.. ‘ఈరోజు బాగుంది.. రేపనేది మరింత బాగుంటుంది’ అనే ఒక ఆశావహ దృక్పథంతో కొత్త సంవత్సరానికి సరికొత్తగా స్వాగతం పలుకుదాం.

Happy News Year – 2025

మీరు చదివింది కరెక్టే.. అక్షర దోషాలేం లేవు. ఈ 2025లో వీలైనన్ని శుభవార్తలు వినాలనే ఆకాంక్షతో కొత్త ఏడాదిని ఆరంభిద్దాం.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  • టీం కపోతం.
You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions