Friday 31st July 2026
12:07:03 PM
Home > క్రీడలు > IPL 2025: కేంద్రం కీలక నిర్ణయం!

IPL 2025: కేంద్రం కీలక నిర్ణయం!

ipl

‌- బీసీసీఐ, IPL చైర్మన్ కి లేఖ!

Govt Of India Letter To BCCI | ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఆదివారంతో ముగిసింది. ఈ టోర్నీలో భారత జట్టు ఘన విజయం సాధించి ట్రోఫీ సాధించడంతో భారతీయలు గర్వంగా ఉప్పొంగుతున్నారు.

ఈ టోర్నీ ముగియడంతో క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ వైపు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది.

అయితే ఈ ఐపీఎల్ 2025 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ బీసీసీఐతో పాటు ఐపీఎల్ చైర్మన్ కు లేఖ రాసింది.

ఆ ప్రకటనలపై నిషేధంతోపాటు క్రీడాకారులు, కామెంటేటర్లు కూడా ప్రమోట్ చేయడానికి వీళ్లేదని లేఖలో పేర్కొంది. ఐపీఎల్ ను యూత్ ఎక్కువగా వీక్షిస్తుంటంతో పొగాకు, మద్యం యాడ్స్ ప్రభావం వారిపై పడే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ రాసిన లేఖలో పేర్కొన్నది.  

You may also like
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions