Sunday 27th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘గాలి జనార్ధన్ రెడ్డి షాక్..సబితా ఇంద్రారెడ్డికి రిలీఫ్’

‘గాలి జనార్ధన్ రెడ్డి షాక్..సబితా ఇంద్రారెడ్డికి రిలీఫ్’

Gali Janardhan Reddy sentenced to 7 years imprisonment in Obulapuram mining case | అనంతపురం జిల్లాలో ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ అనంతరం 15 ఏళ్ల తర్వాత మంగళవారం హైదరాబాద్ సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో మొత్తం ఐదుగురిని కోర్టు దోషిగా తేల్చింది. A1 శ్రీనివాస్ రెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 రాజగోపాల్, A4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ, A7 అలీఖాన్ లను దోషులుగా తెలుస్తూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

ఇదే కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ని మరియు అప్పటి గనుల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అనంతపురం జిల్లా ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ నిజమేనని కోర్టు తేల్చింది.

ఓబులాపురం అక్రమ మైనింగ్‌పై 2009, డిసెంబర్ 7న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2011లో మొదటి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అక్రమ మైనింగ్ ద్వారా దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు.

ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. అలాగే దాదాపు 3337 డాక్యుమెంట్లను కోర్టు పరిశీలించింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions