MLA Fires on Rashmika Mandanna | సినీ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna)పై కర్ణాటకలోని మండ్యా ఎమ్మెల్యే రవి (Mandya MLA Ravi) తీవ్రంగా మండిపడ్డారు. బెంగళూరు (Banglore) వేదికగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (International Film Festival) లో రష్మిక పాల్గొనేందుకు అంగీకరించలేదని ఆరోపిస్తూ విమర్శలు చేశారు.
ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు. తనకు సినీ కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె నేర్చుకోవాలని హితవు పలికారు. “కిరిక్ పార్టీ” (Kirik Party) అనే కన్నడ సినిమాతో కర్ణాటకలోనే తన సినీ కెరీర్ ప్రారంభించారు రష్మికను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరు కావాలని కోరుతూ గతేడాది మేం ఎన్నోసార్లు సంప్రదించినట్లు తెలిపారు.
అయితే ఆమె రానని కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పినట్లు ఎమ్మెల్యే రవి ఆరోపించారు. అంతేకాకుండా తన ఇల్లు హైదరాబాద్లో ఉందనీ కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడారని ఎమ్మెల్యే తెలిపారు.
కన్నడ చిత్రపరిశ్రమ, భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రష్మికకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.