Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > లాభాల్లో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్..సీఎం హర్షం

లాభాల్లో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్..సీఎం హర్షం

CM Revanth Reddy News | దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటైన విషయం తెల్సిందే. దీనిని ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ప్రారంభమైన ఆరు నెలల్లోనే బంక్ నుండి రూ.15.50 లక్షల ఆదాయం వచ్చినట్లు మహిళా సమాఖ్య పేర్కొంది. రోజులు 10 వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ విజయంలో భాగస్వాములైన మహిళా సమాఖ్య సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వంలో ఆడబిడ్డలను మహాలక్షీలుగా తయారుచేస్తామని తాము ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటున్నట్లు సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

ధీరత్వంతో చాకలి ఐలమ్మకు ప్రతీక ఐన తెలంగాణ మహిళ…ఆర్థిక స్వావలంబన, వ్యాపారదక్షతలో సైతం తనకు సాటి లేరని నిరూపించగలదన్న తన నమ్మకం నిజమైందని పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions