Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > రూ.100 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా

రూ.100 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా

HYDRAA News Latest | రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లిలో సర్వే నంబరు 276లో 1.20 ఎకరాల భూమిని బుధవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది.

దీని విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుంది. ఆల్విన్ కాలనీకి ఆనుకుని ఉన్న 276 సర్వే నంబరులో 2.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇప్పటికే కొన్ని ఇళ్లు నిర్మాణం జరిగాయని హైడ్రా పేర్కొంది. ఇంకా మిగిలి ఉన్న 1.20 ఎకరాల భూమి కబ్జా కాకుండా కాపాడినట్లు తెలిపింది.

అనంతరం స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ కంచె వేశారు. అయితే ఈ భూమి తమదంటూ హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీ పోరాడుతోంది. ఇదే సమయంలో ఆల్విన్ కాలనీ సంక్షేమ సంఘంతో పాటు ఆ పక్కనే ఉన్న కాకతీయనగర్ కాలనీ వాసులు మాత్రం ఈ భూమిని కాపాడి.. పార్కును నిర్మించాలనిలని హైడ్రాను కోరుతున్నారు.

You may also like
హైదరాబాద్ లో ఎకరం భూమి రూ. 269 కోట్లు.. ఎక్కడో తెలుసా!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions