Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > సింగపూర్ లో సీఎం రేవంత్..ఆ దేశ మంత్రితో భేటీ

సింగపూర్ లో సీఎం రేవంత్..ఆ దేశ మంత్రితో భేటీ

CM Revanth Reddy Meet’s Singapore Foreign Minister | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ దేశంలో పర్యటిస్తున్నారు.

ఢిల్లీ నుండి గురువారం రాత్రి సింగపూర్ బయలుదేరిన ముఖ్యమంత్రి బృందం శుక్రవారం ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ ( Vivian Balakrishnan ) తో భేటీ అయ్యింది.

ఈ సందర్భంగా సింగపూర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మరియు తెలంగాణలోని ప్రణాళికలపై ప్రధానంగా చర్చించారు. అలాగే నిధుల సమీకరణ పై ప్రధానంగా సమాలోచనలు చేశారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, స్థిరమైన హరిత ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, IT పార్కులు తదితర అంశాల్లో విస్తృత సహకారం, దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు.

సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions