Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > చెస్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాళ్లకు సీఎం అభినందనలు!

చెస్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాళ్లకు సీఎం అభినందనలు!

chess

CM Revanth Congratulates Chess Winners | హాంగరీలోని బడాపెస్ట్ లో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ సెప్టెంబర్ 10 నుంచి 23 వరకు 45వ చెస్ ఒలంపియాడ్ నిర్వహించింది. ఈ చెస్ ఒలంపియాడ్ లో భారత్ తరఫున పలువురు ఆటగాళ్లు పాల్గొని స్వర్ణ పథకాలు సాధించారు.

భారతదేశం తరపున తెలంగాణకు చెందిన అర్జున్, ద్రోణవల్లి హారిక తొలిసారి చెస్ ఒలంపియాడ్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు.  

వారిద్దరూ శుక్రవారం జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి చెస్ ఒలంపియాడ్ లో స్వర్ణపథకాలు సాధించిన తెలంగాణ ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించారు.

వారిని శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరికీ చెరో రూ. 25లక్షలు నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.

You may also like
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions