Sunday 9th August 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ‘మరో భర్త బలి..ఉద్యోగం కోసం పతిని చం*పిన సతి’

‘మరో భర్త బలి..ఉద్యోగం కోసం పతిని చం*పిన సతి’

Bijnor woman arrested for killing husband for govt job | ఉత్తరప్రదేశ్ లో ప్రేమికుడితో జీవించడం కోసం ఓ భార్య, నేవి మర్చంట్ మాజీ అధికారి అయిన తన భర్త సుభాష్ రాజ్ పుత్ ను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెల్సిందే.

ఆ ఘటన మరవకముందే యూపీలోని బిజ్నూర్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త హార్ట్ అటాక్ తో చనిపోయాడని భార్య చెప్పింది. కానీ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దింతో పోస్ట్ మార్టం చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిజ్నోర్‌లో సమీపంలో ముక్రంద్‌పూర్ గ్రామానికి చెందిన దీపక్, నజీబాబాద్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.

సీఆర్ పీఎఫ్ జవాన్ గా పనిచేసిన అతను ప్రస్తుతం రైల్వే ఉద్యోగిగా కొనసాగుతున్నాడు. గత జూన్ 17న చౌహర్‌పూర్ కు చెందిన శివానీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా, పూజ చేస్తూ దీపక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రి తీసుకువెళ్లే లోపే అతడు మరణించాడు. కానీ దీపక్ మరణం పై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది.

దింతో పోస్ట్ మార్టం చేయగా అతడు హార్ట్ అటాక్ తో కాదు గొంతు నులిమి చంపేశారని వెల్లడైంది. అంతకంటే ముందుకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చనట్లు తేలింది. నిద్రమాత్రలతో కూడా ఆహారాన్ని తీసుకున్న అనంతరం దీపక్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.

అనంతరం అతడి భార్య గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భార్య శివానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీపక్ రైల్వే ఉద్యోగాన్ని నొక్కేయ్యడానికే శివాని ఇలా చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే వివాహేతర సంబంధం కూడా మరో కారణమని పేర్కొన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions