Friday 15th May 2026
12:07:03 PM
Home > క్రీడలు > వరల్డ్ కప్ హీరో ఇషాన్ కిషన్‌కు బీహార్ సీఎం బంపర్ గిఫ్ట్!

వరల్డ్ కప్ హీరో ఇషాన్ కిషన్‌కు బీహార్ సీఎం బంపర్ గిఫ్ట్!

Ishan Kishan

Bihar CM Rewards Ishan Kishan | టీ-20 వరల్డ్ కప్ 2026 చాంపియన్ టీం ఇండియాలో కీలక సభ్యుడైన ఇషాన్ కిషన్‌కు సొంత రాష్ట్రం బీహార్‌లో ఘన స్వాగతం లభించింది.

టోర్నీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు గుర్తింపుగా బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఇషాన్‌కు రూ. కోటి నగదు బహుమతిని అందజేశారు.

శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన ఇషాన్, ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్ మరియు ఇతర మ్యాచుల్లో ఇషాన్ ప్రదర్శనను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

బీహార్ యువతకు ఇషాన్ ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ఇషాన్ కిషన్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేయర్లు సాకిబ్ హుస్సేన్, జీషాన్ అన్సారీ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. వీరంతా బీహార్‌తో అనుబంధం ఉన్న క్రీడాకారులు కావడం విశేషం.  

నిజానికి ఇషాన్ కిషన్ బీహార్‌లో జన్మించినప్పటికీ, గత కొన్నేళ్లుగా డొమెస్టిక్ క్రికెట్‌లో ఝార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ, తన సొంత రాష్ట్రం తన విజయానికి అండగా నిలవడంపై ఇషాన్ హర్షం వ్యక్తం చేశారు.

క్రీడలకు ప్రోత్సాహం.. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని, ఇషాన్ వంటి ప్రతిభావంతులు మరింత మంది రావాలని సీఎం ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions