Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తా..టాలీవుడ్ నిర్మాత సంచలన ప్రకటన!

సీఎం రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తా..టాలీవుడ్ నిర్మాత సంచలన ప్రకటన!

revanth reddy

CM Revanth Reddy Biopic | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణమైన రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తానని బండ్ల గణేశ్ ప్రకటించారు. గురువారం సీఎం ప్రమాణ స్వీకార సభాస్థలం ఎల్బీ స్టేడియం వద్ద మీడియా తో మాట్లాడారు బండ్ల గణేష్.

ఈ మేరకు త్వరలోనే రేవంత్ రెడ్డి జీవిత చరిత్రను బయోపిక్ సినిమా తీస్తానంటూ ప్రకటించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విద్యార్థి నాయకుడిగా మొదలై ఈరోజు తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం ఏ సినిమా కథకు తక్కువ కాదని తెలిపారు బండ్ల.

అలాగే రేవంత్ రెడ్డి జీవితం లో లవ్ స్టోరీ మొదలుకొని, ఒక సినిమాకు ఉండాల్సిన అన్నీ హంగులు ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే సిఎం ను కలిసి బయోపిక్ పై చర్చిస్తానని స్పష్టం చేశారు. కాగా 2018 ఎన్నికల్లో మరియు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు బండ్ల గణేష్.

You may also like
గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి!
నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions