Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > అనుముల రేవంత్ రెడ్డి అను నేను..!

అనుముల రేవంత్ రెడ్డి అను నేను..!

CM Revanth reddy

Revanth Reddy Swearing-In Ceremony | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)నేడు ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1:21 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ రేవంత్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. అశేషజనం, కాంగ్రెస్ కార్యకర్తల నడుమ అనుముల రేవంత్ రెడ్డి అను నేను అంటూ సీఎంగా ప్రమాణం చేశారు.

రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు.

అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రకటించారు. అసెంబ్లీలో కొలువై ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరం మిగిలిన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి.

జిల్లాల వారీగా చూసుకుంటే నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం నుంచి భట్టి, తుమ్మల, పొంగులేటికి అవకాశం దక్కింది.

వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ కు మంత్రి వర్గంలో చోటు దక్కింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions