Friday 7th August 2026
12:07:03 PM
Home > తాజా > పద్మ అవార్డుపై బాలయ్య స్పందన

పద్మ అవార్డుపై బాలయ్య స్పందన

Balakrishna Expresses Gratitude for Receiving the Padma Bhushan Award | సినీ రంగానికి చేసిన సేవలకు గాను నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలుపుతున్న అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బాలయ్య పేర్కొన్నారు.

తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు ( Nandamuri Taraka Ramarao ) నుండి ఆయన వారసుడిగా నేటి వరకు వెన్నంటి ఉండి తనను ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానన్నారు. అనంతరం తోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions