Friday 14th August 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘విరాట్ ఎదుర్కున్న కఠినమైన బౌలర్లు వీరే’

‘విరాట్ ఎదుర్కున్న కఠినమైన బౌలర్లు వీరే’

Virat Kohli Names ‘Toughest Bowlers’ He Faced | టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బలమైన బౌలింగ్ ఉన్న దేశాలను ఎదురుకుని భారత్ కు ఎన్నో విజయాలు అందించారు.

అయితే కొందరు బౌలర్లను ఎదురుకోవడం మాత్రం కష్టమని, వారి పేర్లను విరాట్ తాజగా ప్రస్తావించారు. మూడు ఫార్మాట్లలో తనను ఇబ్బందులు పెట్టిన బౌలర్ల గురించి పేర్కొన్నారు. ఐపీఎల్ లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విరాట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎదురుకున్న కఠినమైన బౌలర్లు ఎవరూ అని కోహ్లీని ప్రశ్నించారు. స్పందించిన విరాట్, టెస్టు ఫార్మాట్ లో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్మీ ఆండర్సన్ ను ఎదురుకోవడం తనకు ఇబ్బందిగా ఉండేదని తెలిపారు.

అలాగే వన్డే ఫార్మాట్ లో శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా, ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అలాగే టీ-20 ఫార్మాట్ లో వెస్ట్ ఇండీస్ బౌలర్ సునిల్ నరైన్ తాను ఎదురుకున్న కఠినమైన బౌలర్లని వెల్లడించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions