Friday 18th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వారికి సేవచేయడానికే తెలుగువారు వచ్చారు..నటి వివాదాస్పద వ్యాఖ్యలు

వారికి సేవచేయడానికే తెలుగువారు వచ్చారు..నటి వివాదాస్పద వ్యాఖ్యలు

Actress Kasthuri Shocking Comments On Telugu People | తమిళనాడు ( Tamilnadu )లోని తెలుగు ప్రజలను ఉద్దేశించి నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడే క్రమంలో ఆమె తెలుగువారిని అవమానించారు.

త‌మిళ‌నాడులో జ‌రిగిన బీజేపీ ( BJP ) సభ‌లో కస్తూరి మాట్లాడుతూ.. రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని.. అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది.

300 ఏండ్ల క్రితం ఒక రాజు వద్ద అంత:పుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. కానీ, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ప్రశ్నించింది.

ప్రస్తుతం తమిళనాడు ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారు, ఇతర భార్యలపై మోజుపడొద్దు, ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంచి చెబుతున్నారు కాబట్టే తమిళనాడులో బ్రాహ్మణులకి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోందని కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions