Thursday 15th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వివాహేతర సంబంధం..విడాకులు కోరిన విజయ్ భార్య

వివాహేతర సంబంధం..విడాకులు కోరిన విజయ్ భార్య

Actor Vijay’s wife Sangeetha files for divorce | నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కు బిగ్ షాక్ ఎదురైంది. విజయ్ నుండి విడాకులు కోరుతూ సతీమణి సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 1999 ఆగస్ట్ లో విజయ్-సంగీతకు వివాహం అయ్యింది. వీరికి జేసన్ సంజయ్, దివ్య ఇద్దరు పిల్లలు. అయితే పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత విడాకులు కోరడం చర్చనీయాంశంగా మారింది. సంగీత తన విడాకుల పిటిషన్ లో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపించడం సంచలనంగా మారింది.

ఓ మహిళా నటీమణితో వివాహేతర బంధంలో విజయ్ ఉన్నట్లు 2021లోనే సంగీత గుర్తించిందని పిటిషన్ ద్వారా తెలుస్తోంది. అయితే తన పద్ధతి మార్చుకుంటానని విజయ్ చెప్పారని అయినప్పటికీ వివాహేతర బంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే విడాకులు కోరుతున్నట్లు పిటిషన్ లో సంగీత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాట సంచలనంగా మారింది. 2026 మధ్యలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సిద్ధం అవుతున్న విజయ్ కి వ్యక్తిగతంగా, మానసికంగా ఇది భారీ షాక్ అని కథనాలు వస్తున్నాయి.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions