Friday 27th November 2026
12:07:03 PM
Home > క్రైమ్ > సినిమాలో మొబైల్ నంబర్ వాడినందుకు దర్శకుడిపై కేసు!

సినిమాలో మొబైల్ నంబర్ వాడినందుకు దర్శకుడిపై కేసు!

  • అసభ్యకర కాల్స్‌తో వేధింపులు అంటూ యువకుడి ఫిర్యాదు

Case On Director Martin Prakkat సినిమాలో తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను ఉపయోగించారంటూ ఓ యువకుడు చేసిన ఫిర్యాదు మేరకు ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు మార్టిన్ ప్రక్కట్ (Martin Prakkat) సహా మరో ఇద్దరిపై కొచ్చి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on Duty)లో ఓ మహిళా పాత్ర ఫోన్ నంబర్‌గా తన నంబర్‌ను చూపించారని బాధితుడు ఆరోపించాడు. ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఈ ఎఫ్ఐఆర్ నమోదైనట్లు అధికారులు శుక్రవారం (నవంబర్ 27) వెల్లడించారు.

త్రిక్కాకర ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అక్షయ్ ప్రకాశ్ అనే యువకుడు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ సినిమాలో ఓ మహిళా పాత్రకు సంబంధించిన ఫోన్ నంబర్‌గా తన మొబైల్ నంబర్‌ను తనకు తెలియకుండా, ఎలాంటి అనుమతి లేకుండా ప్రదర్శించారు.

అసభ్యకర కాల్స్, వేధింపులు..

సినిమా విడుదలైనప్పటి నుంచి తన నంబర్‌కు వరుసగా వేధింపులు, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అక్షయ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసభ్యకరమైన కంటెంట్‌తో మెసేజ్‌లు పంపుతున్నారని, దీనివల్ల సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

దర్శకుడితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్..

దర్శకుడు మార్టిన్ ప్రక్కట్‌తో పాటు ‘మార్టిన్ ప్రక్కట్ మూవీస్’ సంస్థకు చెందిన సిబి చావర, రంజిత్ నాయర్లను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, కేరళ పోలీస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions