Thursday 8th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఎన్నికల సంఘంపై దాడి ప్రజాస్వామ్యానికే ప్రమాదం!

ఎన్నికల సంఘంపై దాడి ప్రజాస్వామ్యానికే ప్రమాదం!

  • 42 మంది మాజీ న్యాయమూర్తుల బహిరంగ లేఖ!

42 Retired Judges Open Letter EC కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరియు ఇతర రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బలహీనపరిచేందుకు పద్ధతి ప్రకారం జరుగుతున్న యత్నాలపై 42 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ఉమ్మడి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆధారాలు లేకుండా “ఓట్ల దొంగతనం” అని ఆరోపణలు చేయడం, వ్యవస్థలను “దొంగలు” అని సంబోధించడం ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

సమాజంలో ఓటు (బ్యాలెట్) తన విలువును, నమ్మకాన్ని కోల్పోయినప్పుడు ఆందోళనలు రోడ్డెక్కుతాయని, ఇది తీవ్రమైన సామాజిక అశాంతికి దారితీస్తుందని లేఖలో స్పష్టం చేశారు.

రాజ్యాంగ వ్యవస్థలపై దాడి..

“ఇలాంటి కీలక సమయంలో మౌనంగా ఉండటం సరికాదు. సుదీర్ఘ కాలంగా వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సంఘం, ఉన్నత న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఓట్ల దొంగతనం జరిగింది అని ప్రెస్ మీట్లలో మాట్లాడే నాయకులు, కోర్టుల ముందు గానీ, ఈసీ అడిగినప్పుడు ప్రమాణ పూర్వక పత్రాలు (Affidavits) గానీ ఇవ్వడం లేదు. ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎం (EVM)లను నిందిస్తారు, గెలిచినప్పుడు మౌనంగా ఉంటారు” అని ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) అనేది స్వచ్ఛమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించడానికి చట్టబద్ధంగా జరుగుతున్న ఒక చర్య అని న్యాయమూర్తులు సమర్థించారు.

లేఖపై సంతకం చేసిన ప్రముఖులు..

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో పాటు పలు హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్‌లు ఈ లేఖపై సంతకాలు చేశారు. ఇటీవల ముగిసిన ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 3 కోట్లకు పైగా ఓట్లను తొలగించడం మరియు ఈసీ నిష్పాక్షికతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగానే కాకుండా న్యాయవ్యవస్థలోనూ చర్చనీయాంశమైంది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలి నారీమన్ మాట్లాడుతూ.. “దేశంలో ఓటు హక్కు తీవ్ర ప్రమాదంలో పడింది, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 90 లక్షల మంది ఓటర్లను మినహాయించడం విచారకరం” అని ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పందిస్తూ.. “భారీ సంఖ్యలో భారత పౌరుల ఓటు హక్కును కాలరాసే ఏ చర్య అయినా రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధం” అని స్పష్టం చేశారు.

You may also like
“డజన్ మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు భార్యలు”: సీఎం డీకే కామెంట్స్!
దేశం మీకేం చేసింది కాదు.. మీరేం చేస్తారో ఆలోచించండి: నిర్మలా సీతారామన్
రూ. 5,000 కోట్ల ఆస్తి ఉన్న బీజేపీ ఎమ్మెల్యే.. బిచ్చగాడిలా మారి..!
నాతో కలిసి సాయం చెయ్ సోదరా.. విమర్శలకు సూద్ స్వీట్ రిప్లై!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions