Friday 9th October 2026
12:07:03 PM
Home > తాజా > అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు!

అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు!

vc sajjanar

Hyderabad Police Ban Birthday Celebrations Tank Bund ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు మరియు తల్లిదండ్రులకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

చిన్నారి బర్త్‌డే నాడే విషాదం..

రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు నాడే ఆ పాపతో పాటు కుటుంబసభ్యుడు దుర్మరణం చెందడం నగరవాసులను తీవ్రంగా కలిచివేసింది.

ఉన్నతాధికారుల తనిఖీలు..

ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ట్యాంక్ బండ్ పై ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు.

పోలీసుల హెచ్చరికలు..

ఇళ్ల వద్దే వేడుకలు జరుపుకోవాలి..

పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక అని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేశారు.

అర్ధరాత్రి వేగంగా వచ్చే వాహనాలతో ముప్పు..

అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయని, అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని నడిరోడ్డుపైకి రావడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని గుర్తించాలని కోరారు.

జీహెచ్‌ఎంసీ నిబంధనలు – కఠిన చర్యలు..

ట్యాంక్‌బండ్‌పై బహిరంగంగా కేక్ కటింగ్స్, బర్త్‌డే సంబరాలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం అని, గతంలోనే జీహెచ్‌ఎంసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. నిరంతరం పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ దొంగచాటుగా వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, ఇకపై నైట్ పెట్రోలింగ్‌ను మరింత తీవ్రతరం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

    You may also like
    ఆపరేషన్ కవచ్: హోటళ్లు, లాడ్జీలలో పోలీసుల ముమ్మర తనిఖీలు!
    cm revanth meets jana reddy
    జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!
    cm revath reddy
    హైద‌రాబాద్‌లోనూ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ మోడల్: సీఎం రేవంత్
    Biryani
    న్యూ ఇయర్ జోష్.. నిమిషానికి 1244 బిర్యానీలు, గంటకు 1722 కండోమ్స్ ఆర్డర్!

    Leave a Reply

    Skip to toolbar

    Designed & Developed By KBK Business Solutions