Friday 9th October 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుపతి-కాశీ బైక్ యాత్రపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు!

తిరుపతి-కాశీ బైక్ యాత్రపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు!

PM Modi Praises TDP Tirupati to Kashi Bike Yatra | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ బైక్ యాత్ర’ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుండి ఉత్తరప్రదేశ్ లోని కాశీ (వారణాసి) వరకు సాగిన ఈ బైక్ యాత్రపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. తిరుపతి అలిపిరి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సేవ, సుపరిపాలన (సుశాసన్) అనే సందేశాలను సమాజంలోకి బలంగా తీసుకెళ్లిందని ప్రధాని మోదీ కొనియాడారు.

పవిత్ర నదీ జలాల సమర్పణ..

ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర కృష్ణా, గోదావరి నదుల జలాలను సేకరించి, కాశీ విశ్వనాథునికి సమర్పించడం ఎంతో హృదయానుభూతిని (Touching gesture) కలిగించిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా ఈ బృహత్ యాత్రను విజయవంతంగా నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల బృందాన్ని ప్రధాని మనస్ఫూర్తిగా అభినందించారు.

యాత్ర నేపథ్యం..

తిరుపతి నుండి ప్రారంభమైన ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా సుమారు 2,000 కిలోమీటర్లకు పైగా సాగి వారణాసి చేరుకుంది. ప్రధాని మోదీ ప్రశంసలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అందించిన 25 ఏళ్ల సుపరిపాలనకు ఈ యాత్ర ఒక చిన్న కానుక అని, ఆయన మాటలు కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తిని నింపాయని పేర్కొన్నారు.

You may also like
ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానం.. శ్రీ వినాయక ఆలయంలో ప్రధాని మోదీ పూజలు!
ఇటలీ ప్రధాని మెలోని సరికొత్త రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు!
దేశ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions