Wednesday 9th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 22 ఉరిశిక్షల తర్వాత.. జడ్జి మరోసారి సంచలన తీర్పు!

22 ఉరిశిక్షల తర్వాత.. జడ్జి మరోసారి సంచలన తీర్పు!

UP Judge Ravi Kumar Death Penalty కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 22 మందికి మరణశిక్ష విధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి (ADJ) జస్టిస్ రవికుమార్ దివాకర్ మరోసారి వార్తల్లో నిలిచారు.

2018 నాటి భార్య సజీవ దహనం కేసులో నిందితుడు నదీమ్‌ (38)కు తాజాగా ఆయన ఉరిశిక్ష ఖరారు చేశారు. దీంతో ఆయన విధించిన మరణశిక్షల మొత్తం సంఖ్య 23కు చేరింది.

2018లో తన భార్యను నిప్పంటించి కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడు నదీమ్‌కు జడ్జి రవికుమార్ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు. కొద్ది నెలల కాలంలోనే 23 మరణశిక్షలు విధించడం ద్వారా ఆయన న్యాయస్థాన చరిత్రలోనే అరుదైన మైలురాయిని నమోదు చేశారు.

ఇటీవల ఆయన వరుసగా మరణశిక్షలు విధించడంపై చర్చ నడుస్తుండటంతో, సుమారు 100 కేసులను ఇతర కోర్టులకు అధికారులు బదిలీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

న్యాయమూర్తి స్పందన..

కేసుల బదిలీ ప్రచారాలు ఉన్నప్పటికీ తన శైలిలో ఎలాంటి మార్పు ఉండదని జడ్జి రవికుమార్ స్పష్టం చేశారు. న్యాయ స్థానంలో ఉన్నంత కాలం కేసులలో నిష్పాక్షికమైన తుది నిర్ణయాధికారం తనదేనని ఆయన తేల్చిచెప్పారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions