Modi On Women Bill | శాసనసభలు, పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు ప్రతిపక్షాలు తమ విభేదాలను పక్కనపెట్టి సహకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
“క్రెడిట్ అంతా మీరే తీసుకోండి, కానీ మన తల్లులు, మహిళా సోదరీమణులకు దక్కాల్సిన హక్కులను అందించండి” అని ఎర్రకోట వేదికగా మోదీ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో క్రీడారంగానికి సంబంధించి ఒక భారీ ప్రకటన చేశారు.
2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే భారత లక్ష్యంలో భాగంగా, 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు దేశవ్యాప్త వేట (‘టేలెంట్ హంట్’) ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రతిభావంతులైన చిన్నారులకు అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లుగా మారేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఒలింపిక్స్ సాధనకు మొదటి అడుగు అవుతుందని, యోగా మరియు ఆయుర్వేదం వంటి భారతీయ సంస్కృతి ద్వారా దేశ సాఫ్ట్ పవర్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచుతామని ఆయన ఉద్ఘాటించారు.










