Wednesday 30th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!

దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!

Modi Announces Saptadhara | దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు.

వరుసగా 13వ సారి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, భారత తొలి ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్రధానిగా నిలిచారు.

వికసిత్ భారత్ సాధన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏడు సూత్రాల ‘సప్తధార’ దార్శనికతను ఆవిష్కరించారు. ప్రాచీన ‘సప్త సింధు’ (ఏడు నదులు) భావన ఆధారంగా రూపొందించిన ఈ రోడ్‌మ్యాప్ ద్వారా దేశం స్వీయ సమృద్ధి, స్వావలంబన (‘ఆత్మనిర్భర్ భారత్’) దిశగా సాగుతుందని తెలిపారు.

ఈ సప్తధారలో ఉత్పాదకత, వ్యవసాయం, సాంకేతికత, గతిశక్తి, రక్షణ, ఇంధన భద్రత మరియు సాఫ్ట్ పవర్‌లను ప్రధాన రంగాలుగా చేర్చారు.

రాబోయే 7-8 ఏళ్లలో 7 నుండి 8 సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడమే కాకుండా, చిరుధాన్యాలు వంటి దేశీ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేస్తూ భారత్‌ను గ్లోబల్ ఫుడ్ హబ్‌గా మారుస్తామని చెప్పారు.

You may also like
మూడో బిడ్డను కంటే ₹50,000 ఫిక్స్‌డ్ డిపాజిట్.. ఎక్కడో తెలుసా!
ఇటలీ ప్రధాని మెలోని సరికొత్త రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు!
దేశ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions