Tuesday 11th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > టీటీడీకి రూ.15.24 లక్షల విలువైన ట్రక్ విరాళం!

టీటీడీకి రూ.15.24 లక్షల విలువైన ట్రక్ విరాళం!

  • శ్రీవారి ఆలయం ఎదుట ప్రత్యేక పూజలు

Truck Donated To TTD | తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర మోటార్స్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ లోకనాథ రెడ్డి రూ.15.24 లక్షల విలువైన నూతన ఎస్.ఎం.ఎల్. మహీంద్రా ట్రక్కును విరాళంగా అందజేశారు. టీటీడీ రవాణా అవసరాల నిమిత్తం ఆయన ఈ వాహనాన్ని స్వామివారికి సమర్పించారు.

ఆలయ డిప్యూటీ ఈఓకు తాళాలు అందజేత:

మంగళవారం శ్రీవారి ఆలయం ఎదురుగా నూతన వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం శ్రీ వేంకటేశ్వర మోటార్స్ మేనేజింగ్ పార్టనర్ లోకనాథ రెడ్డి వాహన తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అధికారికంగా అందజేశారు.

తిరుమలలో స్వామివారి నిత్య అవసరాలు మరియు రవాణా సేవలకు ఈ ట్రక్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

You may also like
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!
 చిన్నారికి అన్నప్రాసన చేసిన జనసేనాని!
chandra babu naidu
‘సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్లైన్ లోనే’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions