Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!

బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!

  • కేసీఆర్, కేటీఆర్ సంతాపం

Peddi Sudarshan Reddy Passed Away | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. జూలై 26న హనుమకొండలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.

అనంతరం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో కూడా బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర

1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని టీఆర్ఎస్‌తో ప్రారంభించారు. జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

అనంతరం జిల్లా పార్టీ కన్వీనర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తర్వాత పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

ఎమ్మెల్యేగా సేవలు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సం పేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ (టీఎస్‌సీఎస్‌సీ) చైర్మన్‌గా కూడా సేవలందించారు. ప్రజలతో సన్నిహితంగా మెలిగే నాయకుడిగా గుర్తింపు పొందారు.

కేసీఆర్, కేటీఆర్ సంతాపం

పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి తన ఆప్తమిత్రుడని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు, జైలు జీవితం ఎదుర్కొన్న ధైర్యవంతుడని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సంతాపం తెలిపారు. సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకే కాకుండా తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నల్లబెల్లి గ్రామంలో మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

You may also like
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions