Friday 11th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు!

లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు!

Anti-Paper Leak Bill | దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్ట సవరణ బిల్లును (Anti-paper leak bill) సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

ఈ చట్టాన్ని సవరించేందుకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం రోజున ఈ బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు.

నీట్ (NEET) సహా పలు పోటీ పరీక్షల పేపర్లు లీక్ కావడంపై ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనలు, నినాదాల నడుమే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం జరిగింది. హంగామా కొనసాగడంతో అనంతరం లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.

నీట్ సహా అనేక ఇతర ప్రవేశ పరీక్షల పేపర్లు వరుసగా లీక్ కావడంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులు, ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైన ఆందోళనల ఒత్తిడితో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పేపర్ లీకేజీ వ్యవస్థను అణచివేయడానికి కేంద్రం ఈ కఠిన చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

You may also like
నాతో కలిసి సాయం చెయ్ సోదరా.. విమర్శలకు సూద్ స్వీట్ రిప్లై!
అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసిన రైల్వే.. రూ. 2 లక్షల ఫైన్!
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!
‘విజయ్ ఫర్ పీఎం’ నినాదంపై చెలరేగిన రాజకీయ వివాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions