Tuesday 7th July 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఫిఫా వరల్డ్ కప్.. మెక్సికో ఫ్యాన్స్ పిచ్చి పనులు!

ఫిఫా వరల్డ్ కప్.. మెక్సికో ఫ్యాన్స్ పిచ్చి పనులు!

  • ప్రత్యర్థి జట్లను ఇబ్బంది పెట్టేందుకు హోటల్స్ వద్ద నానా హంగామా!

Mexico Fans Disturb England Players | ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫిఫా వరల్డ్ కప్-2026 (FIFA World Cup 2026) రసవత్తరంగా సాగుతోంది.

అయితే, మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన కంటే కూడా మైదానం వెలుపల కొందరు మెక్సికో అభిమానులు చేస్తున్న వింత చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

తమ దేశం ఎలాగైనా గెలవాలనే మితిమీరిన ఉత్సాహంతో, ఇతర దేశాల ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేందుకు అభిమానులు సరికొత్త పంథా ఎంచుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇంగ్లాండ్ ప్లేయర్ల నిద్ర పాడుచేసే కుట్ర..

తాజాగా ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్-16 (Round of 16) మ్యాచ్‌లో భాగంగా మెక్సికో, ఇంగ్లాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

మెక్సికో సిటీలో సోమవారం జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 2-3 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆదివారం రాత్రి ఒక వింత సంఘటన చోటుచేసుకుంది.

Read Also: ఈ బంధం ఎన్నటికీ మరవలేం.. ఇండియాకు ఇరాన్ థ్యాంక్స్!

హోటల్ వద్ద అర్ధరాత్రి హంగామా..

ఇంగ్లాండ్ ఆటగాళ్లు బస చేసిన హోటల్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న మెక్సికో ఫ్యాన్స్ తీవ్ర హంగామా సృష్టించారు. అర్ధరాత్రి వేళ పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ, బ్యాండ్ మేళాలు వాయిస్తూ, ఈలలు, కేకలతో హోటల్ పరిసరాలను హోరెత్తించారు.

ఇలా హడావిడి చేయడం ద్వారా ఇంగ్లాండ్ ఆటగాళ్లకు నిద్ర లేకుండా చేసి, వారి ఏకాగ్రతను దెబ్బతీస్తే.. తమ దేశం సులభంగా గెలుస్తుందని మెక్సికో అభిమానులు ఆశపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, అభిమానులను హోటల్ ఆవరణ నుండి దూరంగా తరిమేశారు.

అయితే, ఈ అత్యుత్సాహం తమ ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇంగ్లాండ్ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది.

గతంలో ఈక్వడర్ జట్టుకూ ఇదే అనుభవం..

మెక్సికో ఫ్యాన్స్ ఇలాంటి వింత పనులు చేయడం ఇదే మొదటిసారి కాదు. దీనికంటే ముందు జరిగిన రౌండ్ ఆఫ్-32 (Round of 32) మ్యాచ్‌లోనూ వారు ఇలాగే ప్రవర్తించారు. ఆ మ్యాచ్‌లో ఈక్వడర్ జట్టుపై మెక్సికో 2-0 తేడాతో విజయం సాధించింది.

అయితే, ఆ మ్యాచ్‌కు ముందు కూడా ఈక్వడర్ ఆటగాళ్లు బస చేసిన హోటల్ వద్దకు వెళ్లిన మెక్సికో ఫ్యాన్స్ రాత్రంతా నానా రభస చేసి వారి నిద్రను పాడుచేసే ప్రయత్నం చేశారు.

ఆటను ఆటలా చూడకుండా, ఇలాంటి పిచ్చి పనులతో ప్రత్యర్థి జట్లను ఇబ్బంది పెట్టడం క్రీడా స్ఫూర్తికే విరుద్ధమని నెటిజన్లు మండిపడుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions